రాజన్న సిరిసిల్ల జిల్లా: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగాడు. ఇల్లు కేటాయించకుండా స్థానిక నేతలు మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రవీణ్ అనే వ్యక్తి వాపోయాడు.
ప్రవీణ్ తన కుటుంబంతో సహా ఆందోళన ప్రారంభించిన ఉదంతం స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. దీంతో బీజేపీ నేతలు స్పందించి బాధిత కుటుంబానికి మద్దతు ప్రకటించారు. ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.