శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. ఈ లంక స్పిన్నర్ ను ఏడాది పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి బ్యాన్ విధించారు. ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినట్లు జయవిక్రమ అంగీకరించడంతో ఆయనపై నిషేధం విధించారు. ఇందులో భాగంగా కోడ్‌లోని ఆర్టికల్ 2.4.7ని జయవిక్రమ ఉల్లంఘించినట్లు తేలింది. జయవిక్రమ చివరిసారిగా 2022లో శ్రీలంక తరపున ఆడాడు.
అంతకముందు జయవిక్రమపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించిందని అభియోగాలు మోపింది. 25 ఏళ్ల జయవిక్రమ మూడు వేర్వేరు కోడ్‌లను ఉల్లంఘించారని ఐసీసీ ఆరోపించింది. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు 2021 లంక ప్రీమియర్ లీగ్ సీజన్ లో అతనిపై అభియోగాలు మోపింది. జయవిక్రమ లంక ప్రీమియర్ లీగ్ లో 2021 లో జఫ్న కింగ్స్ తరపున ఆడగా.. ఆ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత 2024 సీజన్ లో జయ విక్రమ దంబుల్లా సిక్సర్ తరపున ఆడాడు.
Also Read :- కొత్త రూల్స్‌తో కోహ్లీని ఔట్ చేసిన అనుష్క
తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించేందుకుఆగస్ట్ 6 నుంచి 20 వరకు ఈ గడువు ఇచ్చింది. ఆర్టికల్ 2.4.4 మరియు ఆర్టికల్ 2.4.7 ప్రకారం ICC అతనిపై నేరం మోపింది. ఆర్టికల్స్ 1.7.4.1 అదేవిధంగా 1.8.1 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్ ఛార్జీలతో పాటు లంక ప్రీమియర్ లీగ్ ఛార్జీకి సంబంధించి ఐసీసీ చర్యలు తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. జయవిక్రమ రెండేళ్లుగా శ్రీలంక తరపున ఆడలేదు. శ్రీలంక తరపున మూడు ఫార్మాట్ లలో ఆడిన ఈ స్పిన్నర్ ఖాతాలో మొత్తం 32 అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి.