Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్.. హైజంప్ ఈవెంట్‌లో భారత్‌కు గోల్డ్ మెడల్

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్.. హైజంప్ ఈవెంట్‌లో  భారత్‌కు గోల్డ్ మెడల్

పారిస్ పారాలింపిక్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 6) భారత్ కు మరో గోల్డ్ మెడల్ లభించింది.  పురుషుల హైజంప్ T64 ఈవెంట్‌లో ప్రవీణ్ కుమార్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 2.08 మీటర్ల వద్ద బార్ సెట్‌ను క్లియర్ చేసి అతను వరుసగా రెండో సారి పారాలింపిక్స్ లో పతకాన్ని సాధించాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ప్రవీణ్..మరియప్పన్ తంగవేలు తర్వాత పారాలింపిక్స్‌లో హైజంప్ ఈవెంట్‌లలో స్వర్ణం సాధించిన రెండవ భారతీయుడు.  

Also Read :- ఇంగ్లాండ్ జట్టులో 6 అడుగుల 7 అంగుళాల బౌలర్

అమెరికాకు చెందిన డెరెక్ లోసిడెంట్ 2.06 మీటర్ల జంప్‌తో రజతం సాధించగా.. ఉజ్బెకిస్థాన్‌కు అథ్లెట్ టెముర్బెక్ గియాజోవ్ 2.03 మీటర్ల జంప్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పారిస్‌లో భారత్ ఇప్పటి వరకు 26 పతకాలు సాధించింది. వీటిలో ఆరు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. ప్రవీణ్ విజయంతో భారత్ 2020 పారా ఒలింపిక్స్ (టోక్యో)లో  సాధించిన ఐదు స్వర్ణ పతకాలను అధిగమించింది.