కల్లు దుకాణంలో హత్య!

కల్లు దుకాణంలో హత్య!

టైటిల్ : ప్రావింకుడు షాపు, ప్లాట్​ ఫాం : సోనీ లివ్‌‌‌‌,  డైరెక్షన్ : శ్రీరాజ్‌‌‌‌ శ్రీనివాసన్‌‌‌‌,

కాస్ట్​ : సౌబిన్‌‌‌‌ షాహిర్‌‌‌‌, బాసిల్‌‌‌‌ జోసెఫ్‌‌‌‌, చెంబన్ వినోద్ జోస్, చాందినీ శ్రీధరన్‌‌‌‌

కొంబన్ బాబు (శివాజిత్‌‌‌‌) కల్లు దుకాణం నడుపుతూ ఉంటాడు. అతను చాలా బలవంతుడు, ధైర్యవంతుడు. ఒకరోజు జోరువాన కురుస్తుంటుంది. ఆ టైంలో కల్లు దుకాణంలో అతనితోపాటు 11మంది కస్టమర్లు ఉంటారు. వర్షం తగ్గకపోవడంతో రాత్రంతా అక్కడే పేకాట ఆడుతూ ఉంటారు. తెల్లవారాక చూస్తే బాబు ఉరితాడుకి వేలాడుతూ ఉంటాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్​ మొదలుపెడతారు. సంతోష్‌‌‌‌ (బాసిల్‌‌‌‌ జోసెఫ్‌‌‌‌) నిజాయితీగా ఉండే తెలివైన పోలీస్ ఆఫీసర్. 

అందుకే పైఅధికారులు బాబు కేసుని సంతోష్​కి అప్పగిస్తారు. కల్లు దుకాణంలో పనిచేసే కన్నన్‌‌‌‌ (సౌబిన్‌‌‌‌ షాహిర్‌‌‌‌), అదే గ్రామంలో ఉండే సుని (చెంబన్ వినోద్ జోస్) ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తాడు సంతోష్​. ఆ తర్వాత అతను ఏం చేశాడు? ఈ హత్యతో మెరిండా (చాందినీ శ్రీధరన్‌‌‌‌)కు ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాలి. 

పాప కిడ్నాప్​..

టైటిల్ : ఛోరీ–2, ప్లాట్​ ఫాం :  అమెజాన్​ ప్రైమ్ వీడియో, డైరెక్షన్ : విశాల్ ఫ్యూరియా, కాస్ట్​ : నుష్రత్ బరుచా, సోహా అలీ ఖాన్, గష్మీర్ మహాజని, సౌరభ్ గోయల్, పల్లవి అజయ్, కుల్దీప్ సరీన్, హార్దికా శర్మ

సాక్షి(నుష్రత్ బరుచా) తన భర్త రాజ్ బీర్/ హేమంత్ (సౌరభ్ గోయల్)ని తానే హత్య చేశానని చెప్పి పోలీసులకు లొంగిపోతుంది. కానీ.. అందుకు కావాల్సిన ఆధారాలు లేకపోవడంతో ఆమెని వదిలేస్తారు. ఆ తర్వాత తన కూతురు ఇషాని (హార్దిక శర్మ)ని తీసుకొని వాళ్ల ఊరికి దగ్గర్లోని సిటీకి వెళ్లిపోతుంది. అక్కడ టీచర్​గా పనిచేస్తూ కూతుర్ని చూసుకుంటూ ఉంటుంది. అలా ఏడేళ్లు గడిచాక ఇషానికి ఒక అరుదైన వ్యాధి ఉందని తెలుస్తుంది. ఆమెకు సూర్యరశ్మి తగలకూడదని డాక్టర్లు చెప్తారు. 

దాంతో సాక్షి రోజూ ఇషానిని ఇంట్లో వదిలేసి ఉద్యోగానికి వెళ్లేది. అయితే.. ఒకరోజు వాళ్ల గ్రామస్తులు ఇషానిని కిడ్నాప్ చేసి మళ్ళీ ఊరికి  తీసుకెళ్ళిపోతారు. వాళ్లు ఆమెని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? సాక్షి తన కూతుర్ని కాపాడుకుందా? లేదా? తెలియాలి అంటే సినిమా చూడాలి.