![ప్రయాగ్‌రాజ్ ఫ్లైట్ 6 గంటలు లేట్](https://static.v6velugu.com/uploads/2025/02/prayagraj-flight-six-hours-late_QCZps5f0eI.jpg)
- ఎయిర్‌పోర్టులోనే 180 మంది ప్రయాణికులు పడిగాపులు
- వారిలో సినీ నటుడు విజయ్ దేవరకొండ, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా..
శంషాబాద్, వెలుగు: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న కుంభమేళాకు బయలుదేరాల్సిన స్పైస్జెట్విమానం శుక్రవారం ఆరు గంటలు ఆలస్యమైంది. ఉదయం10.15 గంటలకు బయలుదేరాల్సి ఉండగా టెక్నికల్సమస్యతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది. 180 ప్రయాణికులు దాదాపు ఆరు గంటలపాటు పడిగాపులు కాశారు. వీరిలో ఐపీఎస్ లు షికా గోయల్, విజయ్ కుమార్, సినీ నటుడు విజయ్ దేవరకొండ, పలువురు ప్రముఖులు ఉన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఎయిర్‌పోర్టు అధికారులు ఫ్లైట్‌ను సిద్ధం చేసి ప్రయాగ్ రాజ్ పంపించారు.