సీబీసీ చర్చిలో అభ్యర్థుల ప్రార్థనలు 

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్​పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబడిన బీఆర్​ఎస్​అభ్యర్థి డాక్టర్ సుధీర్​కుమార్, కమేడియన్, ​ప్రజాశాంతి పార్టీ స్టేట్​ప్రెసిడెంట్, అభ్యర్థి​ బాబూమోహన్ వరంగల్ 18వ డివిజన్​లోని సెంటీనరీ బాప్టిస్టు చర్చి(సీబీసీ)లో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా బాబూ మోహన్​తో పలువురు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరంగల్ చర్చిలో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.