విద్యాసంస్థల్లో బతుకమ్మ సంబరాలు

విద్యాసంస్థల్లో బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ మహిళలు, విద్యార్థినులు, అధ్యాపకులు బతుకమ్మ ఆడారు. నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎన్జీ కళాశాల, విద్యా గ్రామర్ స్కూల్ ఆవరణలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, విద్యా గ్రామర్ స్కూల్ హెచ్ఎం లింగయ్య యాదవ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ట్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పాల్గొన్నారు.  

 

 -  వెలుగు ఫొటోగ్రాఫర్, నల్గొండ