Samsung Galaxy Book 4 సిరీస్ ల్యాప్టాప్ కోసం ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది

Samsung Galaxy Book 4 సిరీస్ ల్యాప్టాప్ కోసం ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది

Samsung Galaxy Book 4 ల్యాప్టాప్ కోసం ప్రీ-బుకింగ్ భారతదేశంలో ప్రారంభమైంది. టెక్ కంపెనీ సామ్ సంగ్ గెలాక్సీ బుక్ 4ని నెల క్రితం దక్షిణ కొరియాలో విడుదల చేసింది. త్వరలో ప్రపంచ మార్కెట్ లో విడుదల చేయనుంది. భారత దేశంలో Galaxy Book 4 ల్యాప్టాప్  లాంచ్ కు ముందే కంపెనీ దేశంలో ప్రీ బుకింగ్  ప్రక్రియను ప్రారంభించింది. రాబోయే ల్యాప్ టాప్ ను బుక్ చేసుకుంటే మంచి ఆఫర్లను కూడా పొందవచ్చు. 

బుకింగ్ ధర, ఆఫర్

Samsung  రాబోయే ల్యాప్ టాప్ లాంచ్ తేదీ ఇంకా నిర్ణయించనప్పటికీ వచ్చే వారం వీటిని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్ట వచ్చని భావిస్తున్నారు. వినియోగదారులు Samsung.com, ఆఫ్ లైన్ Samsung రిటైల్ స్టోర్లు, ఇతర భహుళ రిటతైల్ స్టోర్ , దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఈ పోర్టల్ ల ద్వారా వీటిని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. 

ముందస్తు బుకింగ్ కు రూ. 1999 గా నిర్ణయించారు. కొత్త Galaxny Book 4 సిరీస్ ల్యాప్ టాప్ కొనుగోలుపై కస్టమర్లు రూ. 5వేల విలువైన లబ్ధి పొందవచ్చు. అయితే ఈ ఆఫర్లకు సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి వెల్లడించలేదు. 

Also Read : అప్పటివరకు ఏపీ రాజధాని అమరావతే

శామ్ సంగ్ ప్రీమియం సిరీస్ లో  గెలాలక్సీ బుక్ 4 ప్రో, బుక్ 4 ఫ్రో360, బుక్ 4 360, గెలాక్సీ బుక్ 4 అల్ట్రా లాంచ్ అవుతాయని తెలుస్తోంది. మరికొద్ది వారాల్లో ఈ మూడు మోడళ్లను విడుదల చేయనున్నారు. ఈ సిరీస్ లోని ప్రో మోడల్ మార్కెట్లో తర్వాత  లాంచ్ చేసే అవకాశం ఉంది. 

ఫీచర్లు: 

  • Galaxy Book 4 Pro ల్యాప్టాప్  పనితీరు కోసం Intel కోర్ Ultra 5 లేదా Ultra 7 CPU అందిస్తున్నారు. 
  • ఈ ప్రాసెసర్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్తో జత చేయబడింది. ఇది Windows 11 Home OS పై రన్ అవుతుంది. 
  • ఇది 14 అంగుళాల లేదా 16 అంగుళాల AMOLED అనే రెండు డిస్ ప్లే ల ఎంపికలను కలిగి ఉంటుంది. 
  • డిస్ ప్లే సైజును బట్టి దీని బరువు 1.23 కిలోలు లేదా 1.56 కిలోలు. 
  • Galaxy Book 4 సిరీస్ లో డాల్బీ అట్మోస్, Wi-Fi 6E, 
  • బ్లూటూత్ 5.3తో కూడిన AKG క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. 
  • 65 W USB-C ఛార్జింగ్ తో కూడిన 63Wh/76Wh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 
  • Galaxy Book 4 Ultraలో  120 Hz రీఫ్రెష్ రేట్ కు మద్దతు ఇచ్చే 3K AMOLED  డిస్  ప్లే ను కలిగి ఉంటుంది. 
  • Nvidia GeForece RTX 4070 or TRX 4050 GPU ఆప్షన్లను కలిగి ఉంటుంది. 
  • ఈ ల్యాప్ టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 లేదా అల్ట్రా 7 ప్రాసెసర్ లపై పనిచేస్తుంది.
  • ఇది గరిష్టంగా 64 GB వరకు LPDTT5X RAM, 2TB  వరకు స్టోరేజ్ తో అందుబాటులో ఉంటుంది. 
  • ఇక కనెక్టివిటీ ఎంపికలలో థండర్ బోల్ట్ 4, USB టైప్ -A, HDMI 2.1 పోర్ట్, 140W USB-C ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడిన 76 Wh బ్యాటరీ ఉంటుంది.