జీహెచ్ఎంసీకి ముందస్తు ఎన్నికలు.?

జీహెచ్ఎంసీకి ముందస్తు ఎన్నికలు.?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ ఎంసీ)కి ముందస్తు ఎన్ని కలపై సిటీ రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బీజేపీ ప్రాభల్యాన్ని నిలువరించే ప్రయత్నాల్లో భాగంగా జీహెచ్ఎంసీకి కూడా ఎన్ని కలు జరిపేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహం పన్నుతుందన్న అంశంపై  ప్రస్తత కార్పొరేటర్లలోనూ  చర్చశనీయంగా మారింది. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇటీవల పార్టీ సమావేశాల్లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించడం అందుకు బలాన్ని చేకూరుస్తున్నది. ప్రస్తత జీహెచ్ ఎంసీ పాలకమండలికి ఇంకా 2021 ఫిబ్రవరి వరకు(22 నెలలు) ఉంది.అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగాజరిగి నట్లుగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ ఎంసీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదన్న మంత్రి తలసాని మాటలను రాజకీయవర్గాలు ఇప్పటి వరకు ఖండించకపోవడం గమనార్హం. అయితే అధికార వర్గాలు మాత్రం జీహెచ్ఎంసీకి ముందస్తు ఎన్నికలు జరగకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

సిటీలో పట్టు కోసమేనా..

జంట నగరాల్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదు సందర్భంగా మంత్రి తలసాని జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో మళ్లీ టీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు పార్టీ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు మరో రెండేళ్ల కాలవ్యవధి ఉన్నప్పటికీ మంత్రి తలసాని ముందస్తు జపం చేస్తున్నారు. అయితే ఈ మాటలను మంత్రి తలసాని వ్యక్తిగతమా ? పార్టీ ఆదేశాలమేరకు చేస్తున్నారా ? అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏది ఏమైనప్పటికీ జీహెచ్ఎంసీ ముందస్తు ఎన్నికల అంశంపై గ్రేటర్ పరిధిలోఅన్ని రాజకీయపార్టీల మధ్య చర్చకు తావిచ్చింది.అయితే మిగతా అన్ని మున్సిపాలిటీల ఎన్నికలు ముగిసిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయా ? లేకుంలే వాటితో పాటే ఎన్ని కలుజరుగుతాయా ? అనే అంశంపై సందిగ్దత నెల-కొన్నది.

ఇంకా 22 నెలల సమయం

జీహెచ్ఎంసీ పాలక వర్గం కాలవ్యవధి ఇంకా 22 నెలలు ఉంది. 2016 ఫిబ్రవరిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ 99 స్థానాలను గెలుచుకుంది.షెడ్యూల్ ప్రకారం అయితే 2012 ఫిబ్రవరిలోమళ్లీ ఎన్ని కలు జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ముందుస్తు నిర్ణయం తీసుకుంటే గతంలోఅసెంబ్లీ తరహాలో కార్పొరేటర్లతో రాజీనామాలు చేయించే అవకాశం లేకపోలేదు. ఇంక 22 నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ ముం దుస్తు ఎన్ని కలపై మెజారిటీ కార్పొరేటర్లు పెదవి విరుస్తున్నారు. కాలపరిమితి ఉన్నా ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నపక్షంలో న్యాయ పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందన్న అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతో తామంతా ఉన్న పదవీ కాలాన్ని కోల్పోవడమే కాకుండా వెంటనే ఎన్నికలుకూడా జరిగే అవకాశం ఉండదని అంటున్నారు.ఆచరణలో సిట్టిం గ్ లందరికీ మళ్ళీ పోటీచేసే అవకాశం ఉండకపోవచ్చుననే ఆందోళన కూడాప్రస్తుత కార్పొరేటర్లలో వ్యక్తం అవుతున్నది.