కరోనా లేదా కొవిడ్ వైరస్ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ జబ్బు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ విస్తరిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంకాంగ్, మలేసియా, నేపాల్, సింగపూర్, తైవాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల్ని కలవరపెడుతోంది. లేటెస్ట్గా మన దేశంలోని ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో అడుగుపెట్టింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ వైరస్ అంటేనే అందరూ భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచుకోవాలి.
కరోనా వైరస్ సైజులో పెద్దది. ఒక కణం వ్యాసం 400–-500 మైక్రోలు. అందువల్ల ముసుగు వేసుకుంటే వైరస్ చొరబడకుండా ఆపొచ్చు. ఇది గాల్లో స్థిరంగా ఉండదు. గాలి ద్వారా వ్యాపించదు. మెటల్ వస్తువులపై 12 గంటల పాటు బతికి ఉంటుంది. అందువల్ల ఆయా ఐటమ్స్‌ని పట్టుకున్నాక చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ఫ్యాబ్రిక్ మెటీరియల్పైన కరోనా వైరస్ పడితే 9 గంటల పాటు ఉంటుంది. కాబట్టి బట్టల్ని శుభ్రంగా ఉతకాలి లేదా 2 గంటల సేపు ఎండలో ఆరేయాలి. కరోనా వైరస్ మనిషి చేతులకు అంటుకుంటే 10 నిమిషాలు ప్రాణాలతో ఉంటుంది. అలా ఉండకూడదంటే జేబులో ఎప్పుడూ ఆల్కహాల్ స్టెరిలైజర్ని ఉంచుకోవటం బెటర్. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా, తీసుకున్నా వెంటనే చేతులను స్టెరిలైజర్తో వాష్ చేసుకోవాలి. కరోనా వైరస్ 26–-27 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్‌కి గురైతే చనిపోతుంది. ఎందుకంటే ఇది వేడి ప్రాంతాల్లో మనుగడ సాగించలేదు. ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే వేడి నీరు తాగాలి. ఎండలో కూర్చోవాలి. ఐస్ క్రీం, చల్లటి పదార్థాలు తినొద్దు, తాగొద్దు.
దూరం.. దూరం..
వెచ్చని, ఉప్పు నీటితో నోటిని పుక్కిలించుకోవటం ద్వారా టాన్సిల్స్ సూక్ష్మక్రిములు చనిపోయి ఊపిరితిత్తుల్లోకి చేరవు. వీటితోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల్నీ పాటించాలి. అవి.. చేతులను నీట్‌గా కడుక్కోకుండా ముక్కు, నోటి దగ్గర పెట్టుకోవద్దు. కరోనా వైరస్ సోకినవారు తుమ్ముతున్నప్పుడు ముక్కుకి టిష్యూ లేదా కర్చీఫ్ పెట్టుకోవాలి. ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగాలి. దగ్గు, తుమ్ములు, జ్వరం ఉన్నోళ్లకీ మనకీ మధ్య కనీసం మీటర్ (3 అడుగులు) దూరం ఉండేలా చూసుకోవాలి. విదేశాలకు వెళితే నాన్ వెజ్ని బాగా ఉడికించే తినాలి. పచ్చిగా ఉన్నవాటిని లేదా సగం ఉడికిన మాంసాన్ని, గుడ్లను తినకుండా ఉండాలి.
ప్రతిఒక్కరూ తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు..
కరోనా వైరస్ ప్రస్తుతం మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తోంది. కాబట్టి వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా పక్కనోళ్లకు వచ్చే ప్రమాదం ఉంది. మనిషి మాట్లాడినప్పుడు తుప్పర్ల ద్వారా సోకే ఛాన్స్ ఉంది. పేషెంట్‌ని టచ్ చేసినా వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల రోగులు ముట్టుకున్న వస్తువులను మనం పట్టుకున్నా డేంజరే. పరిచయంలేని వ్యక్తులకు దూరంగా ఉండాలి. వ్యాధి ప్రస్తుతం తీవ్రంగా ఉంది కాబట్టి మనకు తెలియనివారితో కలిసి మెలిసి తిరగొద్దు. ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు. వ్యాధి కారకాలు ఒకరి నుంచి మరొకరికి చేరే అవకాశం ఉంది కాబట్టి అపరిచితులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నలుగురిలోకి వెళ్లేటప్పుడు మాస్క్‌తోనే పోవాలి. కొద్ది సమయంలోనే, ఒకేసారి చాలా మందికి వ్యాధి సోకే ప్రమాదం ఉంది కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరి. జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. గర్భిణిలు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు బీ కేర్‌ఫుల్. చలి ప్రదేశాల్లో తిరగొద్దు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నోళ్లు బయటకు రావొద్దు.
అన్నింటికీ మించి..
దగ్గు, జ్వరం వచ్చినోళ్లు జనంలో తిరగకుండా ఇంట్లోనే ఉండి బాగా నీళ్లు తాగాలి. ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్లను ముందే కలవాలి. వ్యాధి తీవ్రమైతే ప్రాణాల మీదకి వస్తుంది. నొప్పి, జ్వరం, దగ్గుకు మందులు వాడాలి. నాలుగేళ్ల లోపు పిల్లలకు దగ్గు మందు, ఆస్పిరిన్ ఇవ్వొద్దు. కొవిడ్–-19 (కరోనా) వైరస్ అనగానే ఆందోళన పడొద్దు. ధైర్యంగా ఉండాలి. ఫేక్ న్యూస్ నమ్మొద్దు. సౌత్ ఇండియాలో టెంపరేచర్లు 28–30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉన్నందున కరోనా వ్యాపించడం కష్టం. ఇంత వేడి వాతావరణంలో 99 శాతం వైరస్ శాతం చనిపోతుంది. కరోనా వైరస్‌కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్(104)ను ఏర్పాటు చేసింది.
రోగ లక్షణాలు
2019 నోవెల్ కరోనా వైరస్ (2019 ఎన్సీఓవీ) లక్షణాలు.. దగ్గు, జలుబు, ముక్కు కారుతూ ఉండటం, జ్వరం,- తలనొప్పి,- గొంతు మంటగా ఉండటం, ఒళ్లు నొప్పులు, ఛాతీలో నొప్పి, న్యుమోనియా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు. దీనివల్ల కిడ్నీల పనితీరు దెబ్బతిని చివరికి చనిపోయే ప్రమాదం ఉంది.