ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : ధర్నాలు, నిరసనతో ఆదిలాబాద్ కలెక్టరేట్ఆవరణ దద్దరిల్లింది. గృహలక్ష్మి పథకం కింద తమకు ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్‌చేస్తూ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం గూడా ఆదివాసులు కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చి ధర్నా చేపట్టారు. అనంతరం జాయింట్‌కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లు ఇస్తామని, వారి సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ హామీ ఇచ్చిందని, వెంటనే వాటిని పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు.
తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సెకండ్ఏఎన్ఎంలు ముందు ధర్నా చేశారు. సీఎం కేసీఆర్తమ పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేసి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ఉద్యోగులు ఆ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ముందు ధర్నా చేపట్టారు. ధర్నాల్లో ఆయా సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
నస్పూర్, వెలుగు : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ చెప్పారు. సోమవారం కలెక్టర్ భవన సమావేశ మందిరంలో ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. దాదాపు 60 అప్లికేషన్లు వచ్చాయన్నారు. వీటిలో భూమి క్రమబద్దీకరణ, భూముల ఆక్రమణ, ఏఎన్ఎంల క్రమబద్దీకరణ, ఓసీపీ ముంపు గ్రామంలో నష్టపోయిన వారికి పరిహారం, పునరావాసం కల్పించాలని తదితర దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.