
ఛాంపియన్స్ ట్రోఫీకి తొలి మ్యాచ్ కు టీమిండియా సిద్ధమవుతుంది. బంగ్లాదేశ్ తో గురువారం (ఫిబ్రవరి 20) జరగబోయే మ్యాచ్ లో అమీ తుమీ తేల్చుకోనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ 2 గంటలకు వేస్తారు. తొలి మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తే.. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లలో ఒకటి గెలిచిన సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవచ్చు. గ్రూప్ దశలో ఆడేది మూడు మ్యాచ్ లే కావడంతో ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే. పాకిస్థాన్, న్యూజిలాండ్ కూడా ఇదే గ్రూప్ లో ఉండడంతో భారత్ సెమీ కు వెళ్లాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే.
ఈ మ్యాచ్ లో భారత్ ఎలాంటి ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగుతుందో ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ జరగబోయే తొలి మ్యాచ్ కు రోహిత్ సేన ఎలాక్టే తుది జట్టుతో బరిలోకి దిగబోతుందో ఒక క్లారిటీ వచ్చేసింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తారు. వీరిద్దరిని జట్టు నుంచి తప్పించలేమని ఇప్పటికే హెడ్ కోచ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.
Also Read:-రేపటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?
ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండడం ఖాయం. వీరు ముగ్గురు జట్టులో ఉండడం వలన బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. 8 వ స్థానం వరకు భారత్ బ్యాటింగ్ దళం బలంగా ఉంటుంది. ఏకైక స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తి కంటే కుల్దీప్ యాదవ్ కే ఛాన్స్ ఇవ్వనున్నారు. ఫాస్ట్ బౌలర్ గా మహమ్మద్ షమీ జట్టులో ఉండడం ఖాయం. అతనితో పాటు మరో పేసర్ గా అర్షదీప్ సింగ్ కు అవకాశం దక్కనుంది. ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ రాణా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ కు భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్. షమీ, అర్ష్‌దీప్ సింగ్