ముగిసిన ప్రీతి అంత్యక్రియలు

ర్యాగింగ్ భూతానికి బలైన డాక్టర్ ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి. గిర్ని తండాలోని తన ఇంటికి సమీపంలోని వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. అవివాహిత కావడంతో సంప్రదాయం ప్రకారం చెట్టుతో పెళ్లి చేసిన అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. తల్లిదండ్రులు, బంధువులు ప్రీతికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె అంతిమయాత్రకు భారీగా జనం తరలివచ్చారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రీతి పాడె మోశారు. ఇదిలా ఉంటే గిర్ని తండాలో ఉద్రిక్తత నెలకొంది. ప్రీతి విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.