ఆటోలో ప్రసవం.. బిడ్డ మృతి

గర్భిణిని పీహెచ్ సీలో చేర్చు కోలే
బూర్గంపహాడ్, వెలుగు: పీహెచ్ సీ సిబ్బంది నిరక్ష్ల్యంతో ఓ గర్భిణి ఆటోలో ప్రసవించగా బిడ్డ మృతిచెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లి బంజర్లో శనివారం రాత్రి జరిగింది. రామాపురం గ్రామానికి చెందిన లక్ష్మిపార్వతికి పురిటి నొప్పులు రావడంతో మోరంపల్లిబంజర్ పీహెచ్ సీకి కాన్పు కోసం ఆటోలో తీసుకెళ్లారు. బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందనే కారణంతో వైద్య సిబ్బంది ఆమెను హాస్పిటల్లో చేర్చుకోవడానికి నిరాకరించారు. దీంతో కుటుంబసభ్యులు ఆటోలో భద్రాచలం హాస్పిటల్కు తీసుకెళ్తుండగా దారిలో ప్రసవించింది. మగశిశువు జన్మించి వెంటనే చనిపోయాడు.

For More News..

మోహన్ బాబు ఫామ్ హౌస్ లో కలకలం

గరీబోళ్ల భూములే దొరికినయా సారూ..