తనకు కాబోయే భర్తను చూపించేసిన ఇలియానా

హీరోయిన్ ఇలియానా డి క్రజ్ ఎట్టకేలకు తన మిస్టరీ మ్యాన్‌ని బయటపెట్టింది. గత కొన్ని రోజుల క్రితమే తాను ప్రెగ్నెంట్ నంటూ అందరికీ షాక్ ఇచ్చిన ఆమె.. ఆ బిడ్డకు తండ్రెవరో మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా ఆ వ్యక్తి ఎవరో రివీల్ చేసింది. ఈ సందర్భంగా ఆమె 'డేట్ నైట్' అంటూ అతనితో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ALSO READ :పొంగులేటి దెబ్బతో నూకల సురేష్ రెడ్డికి గిరాకీ

ఈ ఫొటోల్లో ఇలియానా డి'క్రూజ్ పసుపు బికినీలో బీచ్ డేని ఆస్వాదిస్తోంది. అతనితో కలిసి నవ్వుతూ, భుజంపై వాలి ఉన్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతకుముందు పోస్టులో తనకు కాబోయే భర్తపై చిన్న హింట్ ను వదిలిన ఇలియానా.. ఇప్పుడు ఫైనల్ అతనెవరో ప్రపంచానికి చెప్పకనే చెప్పేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ileana D'Cruz (@ileana_official)