ఎంత దుర్మార్గుడు వీడు.. ప్రేమించానంటూ వెంట పడ్డాడు.. పెళ్లికి ముందే కడుపు చేశాడు.. ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే అడ్డం తిరిగాడు.. ఆ తర్వాత అడ్డు తొలగించేసుకున్నాడు.. ప్రేమ పేరుతో వల విసిరి.. పెళ్లికి ముందే కడుపు చేసి.. ఆ తర్వాత ముక్కలు నరికి.. ఏకంగా పాతిపెట్టేశాడు.. హర్యానా రాష్ట్రంలో జరిగిన ఈ ఘోరం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హర్యానాలోని ఓ పాడుబడ్డ ప్రాంతంలో 19 ఏళ్ల యువతిని కిరాతకంగా చంపి.. శవాన్ని పూడ్చిన ఇద్దరు యువకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. నిందితులను సంజు అలియాస్ సలీమ్, పంకజ్, రితిక్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తన సోదరి కనిపించడకుండా పోయిందని బాధితురాలి సోదరుడు అక్టోబర్ 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే యువతి బాయ్ ఫ్రెండ్ పై పోలీసులకు అనుమానం వచ్చింది. అప్పటికే యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆ కేసు టేకప్ చేయడానికి ఓ స్పెషన్ టీం ను అపాయింట్ చేశారు. సంజు అనే యువకుడు ఆమెను ప్రేమించాడు. కర్వా చౌత్ (అక్టోబర్ 21) రోజున యువతి సంజును పెళ్లి చేసుకోవాలని కోరింది.
తన మోజు తీరాక సంజు పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వస్తున్నాడు. అయితే అప్పటికే ఆమె గర్భవతినని అతనికి చెప్పింది. పెళ్లి విషయంలో ఇద్దరికీ గొడవ అయింది. తర్వాత యువతిని బ్రతిమిలాడి సంజు లాంగ్ డ్రైవ్ అని చెప్పి తీసుకెళ్లాడు. అతని ఫ్రెండ్స్ పంకజ్, రితిక్ ల సహాయంతో సంజు ఓ కారు తీసుకొని.. యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. రోహ్‌తక్ జిల్లాలోని మదీనాలో ఆమెను చంపి.. గొయ్యి తవ్వి డెడ్ బాడీని అక్కడే పూడ్చారు. పోలీసులు సంజును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. దర్యాప్తులో వారు నేరాన్ని అంగీకరించారు. బాధితురాలి కుటుంబం నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.