కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గర్భిణీ ఆస్పత్రికి వెళ్లేందుకు పడిన కష్టాలు అంతా ఇంతాకావు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంలో గర్భిణీని చేతులపై మోస్తూ ఒడ్డుకు చేర్చారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కరంజివాడ గ్రామపంచాయతీ పరిధిలోని బోరిలాల్ గూడ నుంచి ఆదిలాబాద్ రావాలంటే.. అనార్పల్లి వాగు దాటాలి. గ్రామానికి చెందిన జాదవ్ అశ్విని ఏడు నెలల గర్భిణి నెలవారీ వైద్య పరీక్షల కోసం ఆదిలాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉండగా రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో వాగు ఉదృతం ప్రవహిస్తోంది. దీంతో ఆస్పత్రికి వెళ్లేందుకు సౌకర్యం లేక వాయిదా వేస్తూ వచ్చారు. అయితే శనివారం వైద్య పరీక్షలు తప్పనిసరి కావడంతో గర్భిణిని చేతులపై మోస్తూ ఒడ్డుకు చేర్చారు.