సికింద్రాబాద్ వారాసిగూడ బివికే రెడ్డి హాస్పటల్లో నిండు గర్భిణి మృతి చెందింది. మార్చి 21 మంగళవారం ఉదయం 6 గంటలకు డెలివరీ కోసం బివికే రెడ్డి హాస్పిటల్ కు చిలకలగూడకు చెందిన ఫాతిమా బేగంకు (26) వచ్చింది. అయితే ఆమెకు డాక్టర్లు సకాలంలో వైద్యం అందించకపోవడంతో మరణించింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బివికే రెడ్డి హాస్పిటల్ లో సకాలంలో వైద్యం అందించక మృతి చెందిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఫాతిమా బేగం మృతి చెందిందని కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళన దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఫాతిమాబేగం మృతదేహాన్ని తీసుకెళ్ళమని తెలిపారు. దీంతో పోలీసులు ఆస్పత్రి వద్దకు చేసుకొని వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్పిటల్ కి చెందిన డాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు.