టెట్ ఎగ్జామ్​ రాసేందుకు వచ్చిన గర్భిణి మృతి

టెట్ ​రాసేందుకు వచ్చిన ఓ గర్భిణి హై బీపీతో ఎగ్జామ్​ హాల్​లోనే కుప్పకూలి మరణించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఇస్నాపూర్​లో ఈ ఘోరం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి, ఇందిరానగర్​కు చెందిన రాధిక (32) శుక్రవారం టెట్ రాసేందుకు ఇస్నాపూర్​లోని గురుకుల పాఠశాలకు వచ్చారు. 8 నెలల గర్భిణి అయిన రాధికను ఆమె భర్త అరుణ్​బాబు బైక్​పై తీసుకొచ్చారు. 

ALSO READ: ఇప్పటికీ అసలైన చరిత్ర అర్థం చేసుకోలేదు

ఎగ్జామ్​కు ఆలస్యమవుతుందేమోనని రాధిక హడావిడిగా లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో బీపీ ఎక్కువై కూర్చున్న చోటే ఆమె కుప్పకూలిపోయింది. దీంతో భర్త అరుణ్ అక్కడ ఉన్న కానిస్టేబుల్ సాయంతో హాస్పిటల్​కు తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. హై బీపీ కారణంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతిని బ్లీడింగ్ అయి, ఆమె చనిపోయిందని డాక్లర్లు తెలిపారు. రాధికకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.