
- గర్భంలోనే చనిపోయిన కవలలు
పరకాల, వెలుగు : డెంగ్యూతో ఓ గర్భిణి చనిపోయింది. కడుపులో ఉన్న కవలనైనా కాపాడాలన్న ఆలోచనతో డాక్టర్లు డెలివరీ చేయగా వారు సైతం చనిపోయారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన బొమ్మకంటి శిరీష (29) డెలివరీ కోసం తల్లిగారి ఊరైన పరకాల మండలం మల్లక్కపేటకు వచ్చింది. శిరీష అనారోగ్యం బారిన పడడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
అక్కడ పరీక్షించిన డాక్టర్లు శిరీషకు డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో ట్రీట్‌మెంట్ చేశారు. గురువారం ప్లేట్‌లెట్స్ తగ్గడంతో గర్భిణి పరిస్థితి విషమించింది. దీంతో కడుపులో ఉన్న కవల పిల్లలనైనా కాపాడాలన్న ఆలోచనతో డాక్టర్లు డెలివరీ చేశారు. అయితే శిరీషతో పాటు కవలలు సైతం చనిపోయారు.