
- గొంతు నులిమి చంపేసిన భర్త
విశాఖపట్నం: కట్టుకున్న భర్తే నిండు గర్భిణిని గొంతు నులిమి చంపేశాడు. విశాఖపట్నంలోని మధురవాడలో సోమవారం ఈ దారుణ సంఘటన జరిగింది. మధురవాడలో ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో జ్ఞానేశ్వర్, అనూష దంపతులు ఉంటున్నారు. మూడేండ్ల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అనూష ప్రస్తుతం 8 నెలల నిండు గర్భిణి. సోమవారం భార్యాభర్తలు ఏదో విషయంపై గొడవపడ్డారు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన జ్ఞానేశ్వర్.. అనూష గొంతును గట్టిగా నులిమేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
జ్ఞానేశ్వర్ వెంటనే స్థానికుల సాయంతో బాధితురాలిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి కేజీహెచ్ కు తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే అనూష చనిపోయిందని డాక్టర్లు కన్ఫం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.