- ఫోన్ చేసి.. కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడి.. గర్భిణుల డబ్బులు కొట్టేశారు!
- అధికారులమని కాల్ చేసి మోసగించిన సైబర్ నేరగాళ్లు
- ఇద్దరు మహిళల అకౌంట్ల నుంచి రూ. 28 వేలు డ్రా
- నారాయణపేట జిల్లాలో ఒకే రోజు రెండు ఘటనలు
నారాయణపేట, వెలుగు : అంగన్వాడీ టీచర్ కు కాల్ చేసి.. గర్భిణి అకౌంట్ లోని రూ. 25 వేల నగదును సైబర్ నేరగాళ్లు కొట్టేసిన ఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం నారాయణపేట టౌన్14వ వార్డులోని అంగన్వాడీ –2 సెంటర్ టీచర్ఫోన్ కు కాల్ వచ్చింది.
ఓ వ్యక్తి హిందీలో .. హైదరాబాద్‌లోని హెడ్డాఫీసు నుంచి మాట్లాడుతున్నానని, అంగన్ వాడీ సెంటర్ వివరాలు కావాలని అడగడంతో నిజమేనని నమ్మి చెప్పింది. ఆపై సెంటర్‌కు వచ్చే గర్భిణితో మాట్లాడుతానని ఆమెకు తెలపగా వివరాలు చెప్పడంతో కాన్ఫరెన్స్ కాల్ కలిపాడు. దీంతో టీచర్ స్కూల్ కు సరిగా రావడం లేదని తప్పులు చేస్తున్నారని బెదిరించాడు.
వారితో సుమారు15 నిమిషాలు కాన్ఫరెన్స్కాల్మాట్లాడిన తర్వాత ఫోన్కట్చేయగానే గర్భిణి బ్యాంక్ అకౌంట్ లోని రూ.25 వేలు కట్అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆమె అంగన్ వాడీ టీచర్ కు సమాచారం అందించింది. గర్భిణి కొడంగల్‌నుంచి మాట్లాడడంతో అక్కడే కేసు నమోదు చేయాలని అంగన్వాడీ సిబ్బందికి పోలీసులు సూచించారు.
- మరికల్లో.. రూ. 3 వేలు కొట్టేశారు..
మరికల్ : నారాయణ పేట జిల్లా మరికల్ అంగన్వాడీ– 5 సెంటర్ కు చెందిన గర్భిణి అకౌంట్నుంచి సైబర్‌నేరగాళ్లు రూ.3 వేలు కొట్టేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి ‘ పోషన్ట్రాకర్’యాప్ఉంది. ఇందులో కేంద్రానికి వచ్చే లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తారు. దీనిని ఆసరా చేసుకుని యాప్‌కు సంబంధించిన ఆఫీసర్‌ను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానని కొన్ని వివరాలు కావాలని అంగన్వాడీ టీచర్ చంద్రకళకు ఫోన్ చేశారు.
ALSO READ : ఈ వారం గజగజ: టెంపరేచర్లు 3 నుంచి 5 డిగ్రీల దాకా పడిపోయే అవకాశం
ఆమెతో పాటు గర్భిణి దివ్యతోనూ కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడాడు. ఇద్దరితో మాట్లాడుతూనే గర్భిణి అకౌంట్ నుంచి రూ.3 వేలు డ్రా అయినట్టు మెసేజ్ రాగా.. ఆమె అంగన్వాడీ సెంటర్ కు వెళ్లి టీచర్‌తో చెప్పగా అవాక్కైంది. వెంటనే సైబర్క్రైమ్పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితులు తెలిపారు.