వైద్యం వికటించి బాలింత మృతి.. బంధువుల ఆందోళన

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా హాస్పిటల్లో వైద్యం వికటించి ఓ బాలింత చనిపోయింది. మృతురాలిని మోత్కూర్ మండలం అనాజిపూర్ గ్రామానికి చెందిన కొల్లు మానసగా గుర్తించారు. నిన్న ఉదయం 11 గంటలకు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు డాక్టర్లు. మానస ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ తర్వాత డాక్టర్ హాస్పిటల్ నుంచి వెళ్లిపోయాడు.

 రాత్రి బ్లీడింగ్ ఎక్కువ కావడంతో అదే టైంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నల్లగొండకి తీసుకెళ్లాలని డ్యూటీ నర్సు సూచన చేసింది. అయితే నల్లగొండకు తరలిస్తుండంగా మార్గమధ్యలోనే మానస చనిపోయినట్లు బంధువులు చెబుతున్నారు. మానస మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. మృతి కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.