తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రీతి జింటా

తాడ్బండ్   ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రీతి జింటా

ప్రముఖ నటి,ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింటా ఏప్రిల్ 12న ఉదయం హైదరాబాద్ లోని తాడ్ బండ్ వీరాంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ప్రీతి జింటా ఆలయానికి రావడంతో ఆమెను చూడటానికి భక్తులు ఎగబడ్డారు. అయితే ప్రీతి జింటా ముఖం కనిపించకుండా మాస్క్ ధరించి నెత్తిపై చున్నీని కప్పుకున్నారు. 

ఏప్రిల్ 12 (ఇవాళ) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఈసారి అద్భుతంగా ఆడుతోంది. నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. శ్రేయస్ బ్యాట్‌‌‌‌‌‌‌‌తో ముందుండి రాణిస్తూ, కెప్టెన్‌‌‌‌‌‌‌‌గానూ సక్సెస్ అవుతున్నాడు. 

పంజాబ్ విజయాల్లో మరో హైలైట్ యంగ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అనొచ్చు. సీఎస్కేతో గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో మిగతా బ్యాటర్లు ఫెయిలైనా ఖతర్నాక్ సెంచరీతో జట్టును గెలిపించాడు. శశాంక్ సింగ్‌‌‌‌‌‌‌‌ కూడా ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే విషయం. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఆ టీమ్‌‌‌‌‌‌‌‌ మెరుగ్గానే ఉంది. అర్ష్​ దీప్ సింగ్, లోకీ ఫెర్గుసన్, యుజ్వేంద్ర చహల్, యాన్సెన్ సత్తా చాటుతున్నారు. దాంతో పంజాబ్‌‌‌‌‌‌‌‌ కింగ్స్ ఐదో విజయంపై కన్నేసింది.