సుంకిశాల ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ ప్రారంభం

సుంకిశాల ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ ప్రారంభం

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పరిధిలోని మల్లెవాని తండా వద్ద నిర్మాణంలో ఉన్న సుంకిశాల ప్రాజెక్ట్ ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు స్టేట్ విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్​ అడిషనల్ ఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. 

ఆదివారం సుంకిశాల ప్రాజెక్టును స్టేట్ విజిలెన్స్ ఎన్​ఫోర్స్​మెంట్​టీమ్​ సందర్శించింది. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే రికార్డులను పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు సుంకిశాల ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. ప్రాజెక్టును పరిశీలించినవారిలో అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రావు, ఈఎన్సీ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్, డిప్యూటీ ఈఈలు బాలకృష్ణ, శ్రీనివాస్, సీఐలు అభినవ్ చతుర్వేది, గౌస్ ఉన్నారు.