2011లో ప్రముఖ దర్శకుడు కే. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కావాలి చిత్రం మంచి హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రంతో ప్రముఖ సీనియర్ హీరో సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అలాగే డిల్లీ బ్యూటీ ఈషా చావ్లా కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. లవ్ అండ్ ఎమోషన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
ప్రేమ కావాలి చిత్రం ఇటు కమర్షియల్ గా, అటు మ్యూజికల్ గా మంచి హిట్ అయ్యింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.13.7 కోట్లు (షేర్) కలెక్ట్ చేసి దర్శక నిర్మాతలకి లాభాలు తెచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు దేవ్ గిల్ విలన్ గా నటించగా సింధు తులాని, నాజర్, సుప్రీత్ రెడ్డి, షఫీ, ఆలీ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
ALSO READ | సమంత 'సిటాడెల్: హనీ బన్నీ' ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ అదిరిందిగా
అయితే ప్రేమ కావాలి 4కే చిత్రాన్ని అక్టోబర్ 26న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆది సాయి కుమార్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రీ రిలీజ్ ల పుణ్యమా అని ఈ జెనరేషన్ లో అప్పట్లో హిట్ అయిన చిత్రాలని చూస్తున్నామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఒకప్పుడు మంచి క్లాస్ లుక్ తో లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరించిన హీరో ఆది సాయికుమార్ ఈ మధ్య ప్రేక్షకులను సరిగ్గా అలరించ లేకపోతున్నాడు. కాగా ఆమధ్య టాప్ గేర్, క్రేజీ ఫెలో తదితర చిత్రాల్లో నటించినప్పటీ ఈ చిత్రాలు కనీసం రిలీజ్ అయినట్లు కూడా చాలామందికి తెలియదు.