Prema Velluva: హిట్ 3 అప్డేట్.. నాని, శ్రీనిధి శెట్టిల రొమాంటిక్ మెలోడీ రిలీజ్

Prema Velluva: హిట్ 3 అప్డేట్.. నాని, శ్రీనిధి శెట్టిల రొమాంటిక్ మెలోడీ రిలీజ్

నాని హీరోగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్‌‌ : ది థర్డ్ కేస్‌‌’. శ్రీనిధి శెట్టి హీరోయిన్. డాక్టర్ శైలేష్ కొలను దీనికి దర్శకుడు. లేటెస్ట్గా (మార్చి 24న) హిట్ 3 నుంచ్చి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'ప్రేమ వెల్లువ' అంటూ సాగే ఈ పాటను మెలోడీ మాస్ట్రో మిక్కీ జె మేయర్ స్వరపరిచారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్, నూతన మోహన్ కలిసి పాడారు. విశ్వ రఘు నృత్యాలు (కొరియోగ్రఫీ) సమకూర్చారు.

మిక్కీ జె మేయర్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ట్యూన్ ఇచ్చాడు. ఇందులో నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టిల అందమైన ప్రేమ ప్రయాణాన్ని పొందుపరిచారు. సున్నితమైన, శక్తివంతమైన భావోద్వేగాలతో కూడిన ఈ పాట ఆడియన్స్ ను టచ్ చేసేలా ఉంది.

"గీత గీసానే.. వేచి చూసానే.. నిన్ను మించి నాకింక తోడంటు దొరుకునా, ఆపలేనులే (ఆగలేనులే).. చూపలేనులే (చెప్పలేనులే), దాచలేను నేనింక నాలో ప్రేమ.." అనే పదాలు మరింత అందంగా ఉన్నాయి. ఇక హృదయాన్ని కదిలించే స్వరం కలిగిన సిద్ శ్రీరామ్ లిస్టులో ఈ పాట చేరబోతోంది.

యునానిమస్ ప్రొడక్షన్స్‌‌తో కలిసి నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌‌‌‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా మే 1న సినిమా విడుదల కానుంది.

అయితే గతేడాది (2024) హీరో నాని సరిపోదా శనివారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో హిట్ 3 సినిమాతో హిట్ కొట్టి హిట్ ట్రాక్ ని కంటిన్యూ చెయ్యాలని చూస్తున్నాడు.

మరోవేపు దర్శకుడు శైలేష్ కొలను గతంలో తీసిన సైంధవ్ సినిమా ప్లాప్ అయ్యింది. దీంతో హిట్ 3 సినిమాతో హిట్ అందుకోవాలని బాగానే శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం నాని కోర్ట్ మూవీని నిర్మించి భారీ సక్సెస్ అందుకున్నాడు.
 

  • Beta
Beta feature
  • Beta
Beta feature