
గూఢచారి, రావణాసుర లాంటి చిత్రాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ.. ‘ప్రేమ విమానం’ పేరుతో ఓ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో చిన్నారులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ కటా దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు.
నిర్మాత అభిషేక్ నామా బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. ఎలాగైనా విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు, అర్జెంట్‌గా ఫ్లైట్ ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రేమ జంట, మరికొందరినీ ఒక్క చోటకు చేర్చే కథ ఇది. ఈ జర్నీలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ప్రేక్షకులను మెప్పిస్తాయి అంటున్నారు మేకర్స్. త్వరలో జీ5లో ఇది స్ట్రీమింగ్ కానుంది.