Premalo Video Song: ట్రెండింగ్ ‘ప్రేమలో’ ఫుల్ వీడియో వచ్చేసింది.. కథలెన్నో చెప్పారు లిరిక్స్ ఇవే

Premalo Video Song: ట్రెండింగ్ ‘ప్రేమలో’ ఫుల్ వీడియో వచ్చేసింది.. కథలెన్నో చెప్పారు లిరిక్స్ ఇవే

లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్లో ‘ప్రేమలో’సాంగ్ ఒకటి. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ మూవీకి ప్రాణంగా నిలిచిన సాంగ్ ఇది. తాజాగా ప్రేమలో సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. సినిమా రిలీజ్కు ముందే, ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌లో ట్రెండ్‌ అయిన 'ప్రేమలో' వీడియో సాంగ్ రావడంతో   మళ్ళీ ట్రెండ్ అవుతోంది.

ఇందులో నటించిన చందు (హర్ష్‌ రోషన్‌) , జాబిలి (శ్రీదేవిల)లపై చిత్రీకరించిన ఈ సాంగ్ ఎంతోమందిని ఆకట్టుకుంది. వీరి హుక్ స్టెప్, హావభావాలు, కల్మషం లేని ఫీలింగ్స్ ఈ పాటకి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ ఈ గీతానికి పూర్ణా చారి సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి & సమీర భరద్వాజ్ తమ గొంతుతో పాటకి ప్రాణం పోశారు.

నాని సొంత బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమా సుమారు రూ.9కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కింది. మార్చి 14న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.39.60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం కోర్ట్ మూవీ లాభాల్లో అడుగుపెట్టి దూసుకెళ్తోంది. ఇండియా వైడ్ గా రూ.26.02కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

పోక్సో చ‌ట్టంలోని లోతుపాతుల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించారు మేకర్స్. కులం, ప‌గ ప్ర‌తీకారాల కోసం పోక్సో లాంటి చ‌ట్టాల‌ను కొంద‌రు తమ డబ్బు, అధికార మదంతో ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? చ‌ట్టంలోని లోసుగుల కార‌ణంగా ఏ త‌ప్పు చేయ‌ని అమాయ‌కులు ఏ విధంగా బ‌ల‌వుతున్నార‌న్న‌ది అర్థ‌వంతంగా కోర్ట్ సినిమాలో చూపించాడు డైరెక్టర్ రామ్ జగదీశ్.

‘ప్రేమలో’ఫుల్ లిరిక్స్ చూసేయండి:

వేల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత అరెరే

చిన్ని గుండె ఉన్నదెంత
హాయి నింపి గాలినంత
ఊదమంటే ఊపిరెంత అరెరే

కళ్ళు రెండు పుస్తకాలు
భాష లేని అక్షరాలు
చూపులోనే అర్ధమయ్యె
అన్ని మాటలు

ముందు లేని ఆనవాలు
లేనిపోని కారణాలు
కొత్త కొత్త ఓనమాలు
ఎన్ని మాయలు

కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో తప్పు లేదు ప్రేమలో

కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో తప్పు లేదు ప్రేమలో

వేల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత అరెరే

ఆకాశం తాకాలి అని ఉందా
నాతోరా చూపిస్తా ఆ సరదా ఆ ఆ
నేలంతా చూట్టేసే వీలుందా ఆ ఆ
ఏముంది ప్రేమిస్తే సరిపోదా ఆ ఆ

అహ మబ్బులన్ని కొమ్మలై
పూల వాన పంపితే
ఆ వాన పేరు ప్రేమలే
దాని ఊరు మనములే
ఏ మనసుని ఏమడగకు
ఏ రుజువుని ఓ ఓ అంతే ఓ ఓ

కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో తప్పు లేదు ప్రేమలో

మ్మ్ ఎంతుంటే ఏంటంటా దూరాలు
రెక్కల్లా అయిపోతే పాదాలు
ఉన్నాయా బంధించి దారాలు
ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు

అరె నింగిలోని చుక్కలే
కిందకొచ్చి చేరితే
అవి నీకు ఎదురు నిలిపితే
ఉండిపోవా ఇక్కడే
జాబిలి ఇటు చేరెను
పొరపాటునా అని ఓ ఓ అంతే ఓ ఓ

కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో తప్పు లేదు ప్రేమలో

వేల వేల వెన్నెలంత
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత అరెరే

చిన్ని గుండె ఉన్నదెంత
హాయి నింపి గాలినంత
ఊదమంటే ఊపిరెంత అరెరే

కళ్ళు రెండు పుస్తకాలు
భాష లేని అక్షరాలు
చూపులోనే అర్ధమయ్యె
అన్ని మాటలు

ముందు లేని ఆనవాలు
లేనిపోని కారణాలు
కొత్త కొత్త ఓనమాలు
ఎన్ని మాయలు

కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో తప్పు లేదు ప్రేమలో

కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాటారు
యుద్దాలు చేసారు
ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఓ ఓ