ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 10న జరుగునున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక డైట్ మైదానంలో ఏర్పాటు చేయనున్న సభా స్థలాన్ని ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, పార్లమెంట్ ప్రభారి శ్రీనివాస్‌తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు.
అంతకముందు పార్టీ లీడర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు బీజేపీకి వెన్నముక లాంటివని.. వాటిని పల్లెపల్లెకూ చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపై ఉందన్నారు. సోయం మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై చేస్తున్న అసత్య ప్రచారాలను తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాయకులు విజయ బోయర్, మయూర్ చంద్ర, లాలా మున్నా, అంకత్ రమేశ్, వేద వ్యాస్ పాల్గొన్నారు.