హైదరాబాద్ లో సూర్యకాన్​ అవార్డుల ప్రదానం

 హైదరాబాద్ లో  సూర్యకాన్​ అవార్డుల ప్రదానం

హైదరాబాద్, వెలుగు:  ప్రీమియర్ సోలార్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో, అవార్డు వేడుక సూర్యకాన్ 2024  హైదరాబాద్​లో గురువారం జరిగింది.   సోలార్ పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ సందర్భంగా అవార్డులు అందజేశారు. సోవా సోలార్ భారతీయ సోలార్ మాడ్యూల్ తయారీలో అగ్రగామిగా ప్రశంసలు పొందింది. 

సోలిస్ దేశంలోని అగ్రశ్రేణి ఇన్వర్టర్ బ్రాండ్ బిరుదును పొందింది. ఇతర విజేతలలో ఈసీఈ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, యుటిలిటీ స్కేల్  ఉన్నాయి. ఎస్​ఎంఏ సోలార్ ఇన్నోవేటివ్ సర్వీస్ సొల్యూషన్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అవార్డును సొంతం చేసుకుంది. పునరుత్పాదక ఇంధనం కోసం చేసిన కృషికిగానూ సి.నరసింహన్​ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు.