విప్రోలో 1.6 శాతం వాటా కొన్న అజీమ్‌‌‌‌ ప్రేమ్‌‌‌‌జీ పీఈ

విప్రోలో 1.6 శాతం వాటా  కొన్న అజీమ్‌‌‌‌ ప్రేమ్‌‌‌‌జీ పీఈ

న్యూఢిల్లీ : బిలియనీర్‌‌‌‌‌‌‌‌ అజీమ్‌‌‌‌ ప్రేమ్‌‌‌‌జీకి చెందిన ప్రైవేట్ ఈక్విటీ (పీఈ)  కంపెనీ ప్రేమ్‌‌‌‌జీ ఇన్వెస్ట్‌‌‌‌ శుక్రవారం  విప్రోలో 1.6 శాతం వాటాను  రూ.4,757 కోట్లకు కొనుగోలు చేసింది. తన సబ్సిడరీ ప్రజిమ్‌‌‌‌ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ కంపెనీ ద్వారా   ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలో బ్లాక్ డీల్‌‌‌‌లో ఈ వాటాను కొనుగోలు చేసింది. 

ఈ కంపెనీ మొత్తం 8,49,54,128 షేర్లను ఒక్కో షేరుకి రూ.560 చెల్లించి దక్కించుకుంది. మరోవైపు  అజీమ్‌‌‌‌ ప్రేమ్‌‌‌‌జీ ప్రమోటర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న  ప్రజిమ్‌‌‌‌ ట్రేడర్స్‌‌‌‌ మొత్తం   4.49 కోట్ల విప్రో షేర్లను, ఝాష్‌‌‌‌ ట్రేడర్స్‌‌‌‌ 4 కోట్ల షేర్లను విక్రయించాయి. కాగా, ప్రజిమ్‌‌‌‌, ఝాష్ ట్రేడర్స్ విప్రో ప్రమోటర్లు.