మెడ్​ప్లస్​లో వాటా అమ్మకం

మెడ్​ప్లస్​లో  వాటా అమ్మకం

న్యూఢిల్లీ: ప్రేమ్‌‌‌‌‌‌‌‌జీ ఇన్వెస్ట్,  ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ మ్యూచువల్ ఫండ్ సోమవారం మెడ్‌‌‌‌‌‌‌‌ప్లస్ హెల్త్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌లో 6.6 శాతం వాటాను రూ. 552 కోట్లకు బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మాయి. హైదరాబాద్​కు చెందిన  మెడ్‌‌‌‌‌‌‌‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ రిటైల్ ఫార్మసీ,  డయాగ్నోస్టిక్స్ చైన్.  బిలియనీర్ అజీమ్ ప్రేమ్‌‌‌‌‌‌‌‌జీ  పీఈ సంస్థ ప్రేమ్‌‌‌‌‌‌‌‌జీ ఇన్వెస్ట్  పీఐ ఆపర్చునిటీస్ ఫండ్ -ద్వారా, మెడ్‌‌‌‌‌‌‌‌ప్లస్ హెల్త్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌లో 68.93 లక్షల షేర్లు విక్రయించింది. ఎస్​బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో 0.84 శాతం వాటాను ఆఫ్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసింది.

 ఒక్కో షేరుకు రూ.700 చొప్పున అమ్మారు.   వాటా విక్రయం తర్వాత ఫార్మసీ చైన్‌‌‌‌‌‌‌‌లో ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ 4.88 శాతం నుంచి 4.04 శాతానికి తగ్గింది. మోర్గాన్ స్టాన్లీ ఆసియా సింగపూర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్​), ఇన్వెస్కో ఎంఎఫ్,​  కోటక్ మహీంద్రా ఎంఎఫ్​ అదే ధరకు మెడ్​ప్లస్​హెల్త్​ షేర్లను కొనుగోలు చేశాయి.   ఈ ఏడాది  ఆగస్టులో, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ వార్‌‌‌‌‌‌‌‌బర్గ్ పింకస్ మెడ్‌‌‌‌‌‌‌‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ నుంచి ఫార్మసీ చైన్‌‌‌‌‌‌‌‌లోని మొత్తం 11.35 శాతం వాటాను రూ. 836 కోట్లకు  అమ్మేసింది. ఇదిలా ఉంటే హైదరాబాద్​కు చెందిన అపోలో రేడియాలజీ ఇంటర్నేషనల్ (ఏఆర్​ఐ), యూకే  ఇన్‌‌‌‌‌‌‌‌హెల్త్ గ్రూప్  రేడియాలజీ రిపోర్టింగ్ వింగ్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేసినట్లు సోమవారం తెలిపింది.