హసన్ పర్తి, వెలుగు: వరంగల్జిల్లాలోని ఆర్టీఓ ఆఫీసుల ఎదుటే ఫేక్ఫిట్నెస్సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నలుగురి ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ వివరాల ప్రకారం.. వరంగల్ శివనగర్ కు చెందిన గొడుగు ప్రభాకర్, రంగశాయిపేటకు చెందిన గొడిశాల ప్రకాశం వరంగల్ ఆర్టీఓ ఆఫీస్వద్ద, హనుమకొండ విద్యారణ్యపురికి చెందిన ఠాకూర్ మోతీ సింగ్, హసన్‌పర్తిలోని భీమారం ఏరియాకు చెందిన చెల్ల నర్సింహస్వామి చింతగట్టు ఆర్టీఓ ఆఫీస్ ఎదుట ఫేక్ ఫిజికల్ ఫిట్నెస్సర్టిఫికెట్లు తయారుచేస్తున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం వచ్చేవారి నుంచి రూ.500 వసులు చేసి ఫేక్సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఫేక్ డాక్టర్ స్టాంపులు, ఫేక్ఫిట్నెస్సర్టిఫికెట్లు స్వాధీనం చేసున్నారు.