5వ తరగతి నుంచే ప్రిపరేషన్.. 6వ ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు.. షాద్నగర్ అభ్యర్థి సక్సెస్ స్టోరీ

5వ తరగతి నుంచే ప్రిపరేషన్.. 6వ ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు.. షాద్నగర్ అభ్యర్థి సక్సెస్ స్టోరీ

 సివిల్స్ రిజల్ట్స్ లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. షాద్ నగర్ కు చెందిన ఇంద్రార్చిత UPSC లో 739 ర్యాంక్ సాధించింది. దీంతో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. షాద్ నగర్ నుంచి సివిల్స్ కు ఎంపిక కావడం తమకు గర్వకారణంగా ఉందని షాద్ నగర్ వాసులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ర్యాంకర్ ఇంద్రార్చిత మీడియాతో తన అనుభవాన్ని పంచుకుంది. 5వ తరగతి నుంచే తనను సివిల్స్ కు చదివేందుకు తల్లిదండ్రులు, బంధువులు ప్రోత్సహించినట్లు చెప్పారు. సివిల్స్ ను లక్ష్యంగా ఎంచుకుని సాధించినట్లు ఇంద్రార్చిత చెప్పారు. 

సివిల్స్ పరీక్ష్ ఇప్పటి వరకు 6 సార్లు రాస్తే.. 3 సార్లు మెయిన్స్ కు వెళ్లినట్లు చెప్పారు. ఢిల్లీలో కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అయినట్లు తెలిపింది. సివిల్స్ లో ర్యాంకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. తన కుమార్తె ఇంద్రార్చిత UPSC లో ర్యాంక్ సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని తండ్రి రఘు మీడియా కు తెలిపారు..