కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎస్వోటీ పోలీసులు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో కేటుగాళ్లు నిబంధనలకు విరుద్ధంగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు ఆ ముఠా స్థావరాలపై దాడులు చేశారు.
అనంతరం కల్తీ జింజర్ గార్లిక్ పేస్ట్లు.. వాడుతున్న పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి వాటిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని కిరాణ దుకాణాల్లో, హోల్సేల్మార్కెట్లో అమ్ముతున్నారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దందా ఏళ్లుగా జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజారోగ్యంపై అధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.