
వారికి మనుషుల ఆరోగ్యాలంటే లెక్కలేదు. ప్రాణాలంటే పట్టింపే లేదు. విచ్చలవిడిగా ఆహారపదార్థాలు కల్తీ చేస్తూ.. పబ్లిక్ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాని హైదరాబాద్ పోలీసులు ఆగస్టు 25న అదుపులోకి తీసుకున్నారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్పరిధి ఉప్పర్‌పల్లిలో ఓ యజమాని కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్తయారు చేసే పరిశ్రమ నడుపుతున్నాడు. దీనిని మార్కెట్లో విక్రయిస్తున్నాడు.
విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు పరిశ్రమపై దాడులు నిర్వహించారు. ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి అల్లం వెల్లుల్లి తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో బయట పడింది.
కెమికల్స్‌తో పాటు యాసిడ్, కుళ్లిపోయిన పేస్టును ప్యాకింగ్ చేసి ఎక్స్పైరీ డేట్ మార్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడుల్లో 4 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని సీజ్‌చేసి, ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.