సిద్దిపేట టౌన్, వెలుగు: ఇటీవల జరిగిన టీచర్ల బదిలీల్లో స్పౌజ్ పాయింట్లు దుర్వినియోగం చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం టీఎస్పీటీఏ (తెలంగాణ స్టేట్ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్) సిద్దిపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సురేశ్ కుమార్, రవి డీఈవో శ్రీనివాస్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
బదిలీల్లో స్పౌజ్ పాయింట్లు వాడుకుని స్పౌజ్ మండలాలు కాకుండా ఇతర మండలాల్లో ఉద్యోగాలు పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకుని మరోసారి ఇలాంటి అక్రమాలు జరుగాకుండా చూడాలని కోరారు. అలాగే ఇటీవల జరిగిన పదోన్నతుల్లో నాన్ జాయినింగ్పోస్టుల వివరాలు, అర్హుల సీనియార్టీ జాబితా విడుదల చేయాలన్నారు.
డీఎస్సీ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు
సిద్దిపేట రూరల్: డీఎస్సీ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు డీఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 5200 మంది డీఎస్సీ పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. వీరి కోసం పొన్నాల లోని ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజ్, సిద్దిపేట పట్టణంలోని వెరిటాస్ అండ్ వెర్టస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మొదటి విడత ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా పరిశీలకులుగా పి.లక్ష్మయ్య, హెచ్ఎంలు విట్టల్ నాయక్, శ్రీనివాస్, రవిని నియమించినట్లు తెలిపారు.