హైదరాబాద్ : హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి మీడియా పాయింట్ తరలింపుకు సన్నహాలు జరుగుతున్నాయి.సెప్టెంబర్ 29వ తేదీ వరకు బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఉన్న మీడియా పాయింట్ ను షిఫ్ట్ చేయాలని, ఆ తర్వాత స్టేట్ ఆఫీస్ లోకి మీడియాను అనుమతించవద్దని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు.
ప్రకాష్ జవదేకర్ ఆదేశాలతో కింగ్ కోఠి బొగ్గుల కుంటలోని ఓ ప్రైవేట్ బిల్డింగ్ లోకి మీడియా పాయింట్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారుబీజేపీ స్టేట్ నేతలు. బీజేపీ స్టేట్ ఆఫీసు నుంచి మీడియా పాయింట్ ను బొగ్గుల కుంటలోని చర్చ్ అనే ఓ ప్రైవేట్ బిల్డింగ్ లోకి త్వరలో తరలించనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ సునీల్ బన్సల్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ : రవితేజకు జోడీగా రష్మిక.. మరో పాన్ ఇండియా ప్రాజెక్టు సెట్
ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో ఇలానే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియా పాయింట్ ను ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. ఇది జాతీయ పార్టీ విధానమని స్పష్టం చేస్తున్నారు. మీడియా పాయింట్ తరలింపు తర్వాత పార్టీ స్టేట్ ఆఫీసులోకి ఇక మీడియాకు ఎంట్రీ ఉండదు.