శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబు

శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబు

భద్రాచలం,వెలుగు : శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు భద్రాచలం దివ్యక్షేత్రం ముస్తాబవుతోంది. భద్రాచలం, పర్ణశాల రామాలయాలతో పాటు ఆర్చీలకు రంగులు వేసే పనులు మంగళవారం షురూ చేయగా  పంచరంగులతో కళకళలాడుతున్నాయి. వచ్చే నెల 6న సీతారాముల కల్యాణం, 7న పట్టాభిషేకం కార్యక్రమాలు జరగనున్నాయి.  స్వామి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వస్తారు. దీంతో దేవస్థానం  రూ. 2 కోట్ల  వెచ్చించి ఏర్పాట్లు చేస్తోంది. ఆలయంలో మంగళవారం ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.