మార్చి 30న కాంగ్రెస్ సన్నాహక సమావేశం

నల్గొండ అర్బన్, వెలుగు : ఈనెల 30న మట్టపల్లిలో పార్లమెంట్ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కె.శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మొట్టమొదటి సన్నాహక సమావేశం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు.

మంత్రులు ఉత్తమ్​కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితోపాటు సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈనెల 28న సన్నాహక సమావేశం నిర్వహించాల్సి ఉండగా సీఈసీ మీటింగ్ నేపథ్యంలో 30వ తేదీకి వాయిదా పడిందన్నారు. ఈ సమావేశానికి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు సకాలంలో హాజరుకావాలని కోరారు.