TheGOAT: విజయ్ ది గోట్ అప్డేట్..హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAT). మీనాక్షి చౌదరి హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, టీజర్ విజువల్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈమూవీ వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇవాళ సెప్టెంబర్ 2న హైదరాబాద్ ట్రిడెంట్ హోటల్ లో సాయంత్రం 6గంటలకు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 

ALSO READ : Jr NTR: కేశవనాథేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న ఎన్టీఆర్..వీడియో పోస్ట్ చేసిన రిషబ్ శెట్టి

ఎజిఎస్ ఎంటర్‌‌టైన్‌‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు స్టేట్స్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రిలీజ్ చేయనున్నారు. ఇందులో విజయ్ తండ్రీ కొడుకులుగా రెండు డిఫరెంట్ గెటప్స్‌‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రియా భవానీ శంకర్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌‌.

గోట్ మూవీలో సీనియర్ హీరోయిన్స్ స్నేహా, లైలాతో పాటు జయరాయ్, ప్రశాంత్, ప్రభుదేవా, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. విజయ్‌‌కి ఇది 68వ చిత్రం. ఇటీవల విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇదే తన ఆఖరి చిత్రంగా ప్రచారం జరుగుతోంది.