- ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
యాదాద్రి, వెలుగు : వలిగొండలో నాలుగు లైన్ల కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం భువనగిరి –-చిట్యాల మార్గంలో వలిగొండ బ్రిడ్జిని ఎమ్మెల్యే పరిశీలించారు. వెంటనే ఆర్అండ్బీ అధికారులను అక్కడికి పిలిపించారు. బ్రిడ్జిపై ఉన్న గుంతలను వారికి చూపించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డుపై వాహనాల రద్దీ పెరిగినందున ప్రస్తుతం ఉన్న ఈ బ్రిడ్జి సరిపోదన్నారు. భవిష్యత్‌లో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున నాలుగు లైన్ల బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. అనంతరం బీబీనగర్మండలంలోని రుద్రవెల్లి లోలెవల్అండర్ బ్రిడ్జిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.