
భీమదేవరపల్లి, వెలుగు: ములుకనూర్సొసైటీ 68వ వార్షిక మహాసభ సంఘం ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు ఎ.ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. అలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి కొంత మంది కలిసి 1956లో 373 మంది సభ్యులతో 2300 వందల వాటాధనంతో ములుకనూర్ సొసైటీని ప్రారంభించారన్నారు. 14 గ్రామాల్లో 7641 మంది సభ్యులతో మూడు వేల కోట్లకు పైగా వ్యాపారాన్ని ములకనూరు సొసైటీ నిర్వహిస్తోందన్నారు.