ఘనంగా పీఆర్టీయూ 53వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా పీఆర్టీయూ 53వ ఆవిర్భావ దినోత్సవం

వనపర్తి, వెలుగు: పీఆర్టీయూ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం సంఘ కార్యాలయం ఆవరణలో జిల్లా అధ్యక్షుడు బౌద్ధారెడ్డి జెండాను ఎగరేశారు. సంఘ వ్యవస్థాపకుడు   సామల యాదగిరి ఫొటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పీఆర్టీయూ ముందుంటుందని పేర్కొన్నారు. సంఘం నేతలు చంద్రశేఖర్, కె.శివకుమార్, శేఖర్, సత్యనారాయణ, వెంకట్రాంరెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు. 

నారాయణపేట: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పీఆర్టీయూతోనే సాధ్యమని సంఘం జిల్లా అధ్యక్షుడు వై.జనార్దన్​రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఆదర్శ బీఈడీ కాలేజీలో సంఘం ఆవిర్భావ దినం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. సంఘ నేతలు పి వెంకట్ రెడ్డి, తిరుపతి, పి నరసింహారెడ్డి, నారాయణపేట, దామరగిద్ద, ఊట్కూర్, ధన్వాడ, మద్దూర్, కోస్గి, కృష్ణ, మరికల్  మండల బాధ్యులు పాల్గొన్నారు.