బోధన్, వెలుగు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బోధన్ డివిజన్ సేవలు అభినందనీయమని సొసైటీ జిల్లా అధ్యక్షుడు బుస్స ఆంజనేయులు అన్నారు. బుధవారం బోధన్ డివిజన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమవేశం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ఆఫీస్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పరిధిలో 2,569 యునిట్ల రక్తం సేకరించామన్నారు.
1,004 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం, మందులు అందజేశామని తెలిపారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోను కలసి సొసైటీ సేవలు వివరించారు. కార్యక్రమంలో ఏసీపీ పి.శ్రీనివాస్, తహసీల్దార్విఠల్, సొసైటీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు బసవేశ్వరరావు, జిల్లా కోశాధికారి కరిపె రవీందర్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్మెంబర్లు తోట రాజశేఖర, కొడాలి కిషోర్, శ్రీనివాసరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.