18వ ప్రవాసీ భారతీయ దివస్సదస్సు ముగింపు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 27 మందికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రదానం చేశారు.
అవార్డు గ్రహీతలు:
- ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షులు క్రిస్టీనా కార్లా కంగాలూ(పబ్లిక్ అఫైర్స్ కేటగిరి),
- అజయ్ రాణే (ఆస్ట్రేలియా, కమ్యూనిటీ సర్వీస్),
- మరియాలేనా జోన్ ఫెర్నాండెజ్(ఆస్ట్రియా, విద్య),
- స్వామి సంయుక్తానంద(ఫిజీ, కమ్యూనిటీ సర్వీస్),
- సరస్వతీ వియానికేతన్ (గయానా, కమ్యూనిటీ సర్వీస్),
- లేఖ్రాజ్జునేజా(జపాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ),
- ప్రేమ్ కుమార్(కిర్గీజ్ రిపబ్లిక్, మెడికల్ సైన్స్),
- సౌక్తవీ చౌదరి(లావోస్, బిజినెస్),
- బారోనెస్ ఉషా కుమారి పరాషర్(బ్రిటన్, రాజకీయరంగం),
- డాక్టర్ షర్మిలా ఫోర్డ్(అమెరికా, సమాజ సేవ),
- డాక్టర్ సయ్యద్ అన్వర్ ఖుర్షీద్(సౌదీ అరేబియా, వైద్య రంగం).
ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ విదేశాల్లో ఉన్న భారతీయులకు ప్రదానం చేసే అత్యున్నత అవార్డు. భారత ఉపరాష్ట్రపతి చైర్మన్ గా, విదేశీ వ్యవహారాల మంత్రి వైస్ చైర్మన్గా ఉన్న కమిటీ ఈ అవార్డు గ్రహీతలను ఎంపిక చేస్తుంది.