అమెరికాలో మహిళలు, పురుషులకే తప్ప మూడో జెండరు గుర్తింపు కల్పించబోమని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాస్ పోర్ట్ జారీలో మేల్, ఫిమేల్లను మాత్రమే అధికారులు గుర్తిస్తున్నారు.
థర్డ్ జెండర్ను సూచించేలా ఎక్స్ (ఆంగ్ల అక్షరం X)గా పేర్కొన్న దరఖాస్తులను పక్కన పెడుతున్నారు. బైడెన్ సర్కారు హయాంలో 2022 నుంచి థర్డ్ జెండర్ ను 'ఎక్స్' గా గుర్తిస్తూ పాస్ పోర్టులు జారీ చేశారు. ఇలాంటి పాస్ పోర్టులను అధికారులు రెన్యూవల్ చేయట్లేదు.
ALSO READ | అమెరికాలో అక్రమంగా ఉంటున్న 538 మంది అరెస్టు
కొత్తగా ఎక్స్ గుర్తింపుతో పాస్ పోర్టులు జారీ చేయడం, పాత వాటి రెన్యూవల్, పాస్ పోర్ట్లలో జెండర్ మార్పులకు వీలులేదని స్పష్టం చేస్తున్నారు.