ఎంపీలకు రాష్ట్రపతి ముర్ము అల్పాహార విందు .. హాజరైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు

ఎంపీలకు రాష్ట్రపతి ముర్ము అల్పాహార విందు .. హాజరైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు

న్యూఢిల్లీ, వెలుగు:  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణతో పాటు తమిళనాడు, ఒడిశా, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల ఎంపీలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్‌‌కుమార్‌‌‌‌ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రఘురాం రెడ్డి, సురేశ్ షట్కర్, బలరాం నాయక్, కడియం కావ్య, అనిల్ పాల్గొన్నారు.

 బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, అర్వింద్, నగేశ్‌‌, రఘునందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్‌‌‌‌, బీఆర్ఎస్ నుంచి దామోదర్ రావు, వద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్‌‌కుమార్ రెడ్డి, రఘువీర్, వద్దిరాజు ప్రత్యేకంగా రాష్ట్రపతితో కాసేపు మాట్లాడారు.