త్వరలోనే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్లమెంట్ బడ్జె్ట్ సెషన్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీం ద్వారా లక్షలాది మందికి సొంతింటి కల నెరవేరబోతుందన్నారు. మూడు కోట్ల మంది పేదలకు సొంతిళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మహాకుంభమేళా భారత సంస్కృతికి చిహ్నమని..కుంభమేళ సమయంలో సమావేశాలు ప్రారంభించుకంటున్నామని తెలిపారు. మహా కుంభ మేళాలో కోట్లాది మంది పుణ్య స్నానాలు చేస్తున్నారని చెప్పారు ద్రౌపది ముర్ము.
బడ్జెట్ లో పేదలు,యువత,రైతులు,మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎన్డీయే ప్రభుత్వం మూడో టర్మ్ లో మూడు రెట్ల వేగంతో అభివృద్ధి చెందుతుందన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. ఉద్యోగుల కోసం 8 వ పే కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. అమృత భారత్, నమో భారత్ రైల్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దేశఅభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందాలన్నారు. పేదరిక నిర్మూలనకు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
Also Raed : చారిత్రాత్మక బిల్లులు తెస్తున్నాం
విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ట్యాక్స్ విధానాల ను సరళీకరించామని తెలిపారు. లక్ష 15 వేల మంది మహిళలు లక్ పతీ దీదీలుగా మారారు.3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలన్నదే తమ సంకల్పమన్నారు. మన దేశ మహిళలలు ఒలింపిక్ లు పథకాలు సాధిస్తున్నారని చెప్పారు. ఏఐ,డిజిటల్ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు ద్రౌపది ముర్ము.